Tuesday, June 16, 2026
Homeసినిమాపవన్, బాలయ్యల టాక్ షోలో ఆసక్తికర అంశాలు....

పవన్, బాలయ్యల టాక్ షోలో ఆసక్తికర అంశాలు….

నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ సక్సెస్ అవ్వడంతో సెకండ్ సీజన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సెకండ్ సీజన్ సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడం.. దీనికి సంబంధించిన ప్రొమో రిలీజ్ చేస్తే.. ట్రెండింగ్ లో నిలవడం తెలిసిందే. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ టాక్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని తెలిసినప్పటి నుంచి అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురు చూశారు.

అయితే… అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ నెల 27న పవర్ స్టార్ తో అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో కలిసి వచ్చారు. అయితే.. తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ కలిసి చేస్తున్న షో కావడంతో బాలకృష్ణ ఎటువంటి సరదా ప్రశ్నలు అడుగుతారు, దానికి పవన్ కళ్యాణ్‌ ఏ విధంగా సమాధానం ఇస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇంతకీ ఈ టాక్ షోలో బాలయ్య ఏ ప్రశ్నలు అడిగారంటే.. మూడు పెళ్లిళ్ల గురించి ప్రశ్నలు అడిగారని.. అలాగే తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కూడా అడిగారని వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రాజకీయాల గురించి అలాగే ఫ్యూచర్ లో ఏం చేయాలి అనుకుంటున్నావు అని కూడా అడిగారని తెలిసింది. ఈ వార్త బయటకు రావడంతో ఎప్పుడెప్పుడు ఈ స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారా అని పవర్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ ఎపిసోడ్ ని 2023 సంక్రాంతి సందర్భంగా ఆహా వారు ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే… దీని పై ఆహా టీమ్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular