యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న పదో విడత రైతుబంధు నగదును కాసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో 607.32 కోట్లు జమ చేయబడ్డాయి