Thursday, June 18, 2026
HomeTrending Newsదేశ భద్రత పట్టించుకోని బీజేపీ - రేవంత్ విమర్శ

దేశ భద్రత పట్టించుకోని బీజేపీ – రేవంత్ విమర్శ

వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజల సమస్యలపై పోరాడేందురు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు పెద్దవని రేవంత్ గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసగించారు. దేశంలో, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది, కుటుంబ సభ్యులు పెరిగారు, వారి ఆశలు, ఆకలి పెరిగాయి, అందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. పార్టీ ఆఫీసు కోసం మూడు రోజులు ఢిల్లీలో ఉన్న కేసీఆర్… విభజన చట్టం ద్వారా మనకు హక్కుగా దక్కాల్సిన ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని తెలిపారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మహిళా రిజేర్వేషన్ బిల్లుకు అడ్డుపడింది బీజేపీ అని ఆరోపించారు. జానారెడ్డి పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్న 2011లో స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్ ను 50 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు.

దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. పాకిస్థాన్, చైనా మన దేశంపై కుట్రలు సాగిస్తున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. దేశ భద్రతను పట్టించుకోకుండా… విపక్షాల ప్రభుత్వాలు కూల్చడం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించగానే మోదీ పీఠం కదిలింది. అందుకే కోవిడ్ పేరుతో రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆపాలని కుట్ర చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular