తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన డా. గురుమూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటి జరిగింది. ఉప ఎన్నికలో 2,71,592 ఓట్ల మెజార్టీని సాధించి ఘన విజయం సాధించిన డాక్టర్ ఎం. గురుమూర్తిని, పార్టీ నేతలను సిఎం జగన్ అభినందించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి కూడా పాల్గొన్నారు.