తెలుగు .. కన్నడ భాషల్లో రష్మికకి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లోని టాప్ త్రీ స్థానాలకి సంబంధించిన రేసులో కొనసాగుతున్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. తెలుగు .. కన్నడ భాషల్లో మాదిరిగానే, తమిళ .. హిందీ భాషల్లోను పాగా వేయాలనే గట్టిపట్టుదలతో ఆమె ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా .. అది సాధించిన రికార్డులు ఈ బ్యూటీ కెరియర్ కి బాగానే హెల్ప్ అయ్యాయి
అయితే ఆ తరువాత రష్మిక చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మాత్రం ఆడియన్స్ కి ఎంతమాత్రం కనెక్ట్ కాలేదు. ఇక ఆ తరువాత చేసిన ‘సీతా రామం’ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసినప్పటికీ, ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాకపోవడం వలన ఆ క్రెడిట్ ఆమె ఖాతాలో పడలేదు. ఇక ‘పుష్ప 2’ లైన్లో ఉన్నప్పటికీ, అది ఎప్పటికోగాని థియేటర్లకు వచ్చే ఛాన్స్ లేదు.
ఈ నేపథ్యంలోనే రష్మికకి ఊరటా కలిగిస్తూ ‘వారసుడు’ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఇది పాన్ ఇండియా కంటెంట్ తో ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. విజయ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే తమిళనాట ఏ స్థాయిలో సందడి ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతంలో అక్కడ రష్మిక చేసిన ‘సుల్తాన్’ సరిగ్గా ఆడలేదు. అందువలన ఈ సినిమాతో అక్కడ మార్కెట్ పెంచుకోవచ్చని భావిస్తోంది. అలాగే ఈ సినిమాతో ఆడియన్స్ తో పెద్ద గ్యాప్ రాకుండా ఉంటున్నందుకు ఖుషీ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే రష్మికకి సంబంధించిన లెక్కలు మారిపోవడం ఖాయమేనని అనుకోవాలి.
Also Read : ‘వారసుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల