Thursday, June 18, 2026
HomeTrending Newsకృష్ణా జలాల వాటా సాధనకై రేపు కోదండరాం దీక్ష

కృష్ణా జలాల వాటా సాధనకై రేపు కోదండరాం దీక్ష

కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని,కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేసింది. కృష్ణా, గోదావరి నదులపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను ఉపసంహరించుకోవాలి అని కోరుతూ తెలంగాణ జనసమితి రాష్ట్ర అద్యక్షుడు కోదండరాం రేపు తెలంగాణ జనసమితి కార్యాలయంలో దీక్ష చేస్తారు.
కృష్ణా నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతు కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ జనసమితి యాత్ర నిర్వహించి ఇప్పటికే వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఉద్యమాన్ని తీవ్రం చేయుటలో భాగంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జనసమితి బృందం ఈ నెల 30,31వతేదిలలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, క్రష్ణా, గోదావరి బోర్డ్ ను కలువనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular