Sunday, November 24, 2024
Homeసినిమావీర మాస్ ఫాన్స్ మేమే...మేమే!

వీర మాస్ ఫాన్స్ మేమే…మేమే!

హేయ్ నేనే నేనే నేనే హేరో
నేనే లే నా మీరే జీరో
చుక్కలన్ని నన్ను చుట్టు ముట్టి ఉన్నా
అందగాదు ఒక్కడేలే
నింగి నన్ను చూసి కల్లు కుట్టుకున్నా
చందమామ ఇక్కడేలే
నేనే నేనే హేరో
నేనే లే నా మీరే జీరో
నేనే నేనే హేరో
నేనే లే నా మీరే జీరో

అవును. మేము మా హీరోలకు వీరాభిమానులం. వారికోసం ఏమైనా చేస్తాం. క్లాసులు ఎగ్గొడతాం. హీరో బతికున్నా సరే, దండలు వేస్తాం. పాలాభిషేకాలు చేస్తాం. మొదటిరోజు మొదటి ఆట చూడటం కోసం నిద్రాహారాలకు దూరమైనా లెక్క చేయం. ఈ పిచ్చి ఎప్పటినించీ ఉందంటారా? అబ్బో , చాలా చరిత్ర ఉంది

మొదట్లో సినిమాలు పద్ధతిగా ఉండేవి. అప్పుడు అభిమానులూ అంతే. మెల్లగా రంగు సినిమాలు మొదలయ్యాక అసలు రంగులన్నీ బయటకొచ్చాయి. అయితే చాలా ఏళ్ళ పాటు అభిమానసంఘాలు దిగువ స్థాయి వారికే పరిమితం అయి ఉండేవి. డాన్సులు, పాటలు అంటూ కుర్ర హీరోలు వచ్చినప్పటినుంచీ చదువుకునే పిల్లలు అటు తిరిగారు. చదువు నుంచి తప్పించుకోడానికి ఇదో గొప్ప సాధనమైంది. మెల్లగా కాలేజీల్లో హీరోల అభిమాన సంఘాలు మొదలయ్యాయి. అంతకుముందు కులాలవారీగా విద్యార్థి సంఘాలుగా ఉన్నవి హీరోల అభిమాన సంఘాలయ్యాయి.

మన బందెలదొడ్డి ఓపెన్ థియేటర్ బ్యాచ్ ల అత్యుత్సాహంతో అమెరికా థియేటర్లో వీరసింహారెడ్డి సినిమా నిలిపివేత.

మేము ఎంత చదువుకున్నా, విదేశాల్లో ఉన్నా మా హీరో పట్ల అభిమానం మారదు. మా తల్లిదండ్రులూ మమ్మల్ని కులాభిమానం ఉండాలనే పెంచారు. అంచేత వాల్తెరయినా, అనంతపురమైనా మా హీరో, మా కులం ముఖ్యం. అమెరికా అయినా సరే, తగ్గేదే లేదు. ఇండియాలో లానే సినిమా విడుదల రోజు టిక్కెట్లు చింపుతాం, సీట్లూ చింపుతాం. అభిమానం అంతే. సినిమా ఆగిపోతే మాకేంటి? కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసిందిగా! అంచేత ప్రపంచానికి మేము చెప్పేదేంటంటే, మేము మా హీరోలు మారం. ఇలాగే ఉంటాం. మీరే సర్దుకుపోండి!

( ఇటీవల అమెరికాలో విడుదలైన వీరసింహారెడ్డి సినిమా థియేటర్ లో అభిమానుల దెబ్బకి షో క్యాన్సిల్ చేశారనే వార్త ఆధారంగా)

RELATED ARTICLES

Most Popular

న్యూస్