Wednesday, June 17, 2026
Homeసినిమాహీరో కార్తీక్ రాజు ‘అథర్వ’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

హీరో కార్తీక్ రాజు ‘అథర్వ’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు యంగ్ హీరో కార్తీక్ రాజు. ఇప్పటికే పడేసావే, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కౌసల్య కృష్ణ మూర్తి సినిమాలు చేసి టాలీవుడ్ ఆడియన్స్ మన్ననలు పొందారు. సిల్వర్ స్క్రీన్ పై కార్తీక్ రాజు నటన పై ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. దీంతో కెరీర్ పరంగా బిజీగా మారిన కార్తీక్ రాజు నేడు (జనవరి 17) పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ అథర్వ యూనిట్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కార్తీక్ రాజు సీరియస్ లుక్ లో కనిపిస్తూ సినిమా పై ఆసక్తి పెంచారు.

యంగ్ అండ్ టాలెంటెడ్‌ కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న తాజా సినిమా అథర్వ. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో పలు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ అథర్వ సినిమాను మహేష్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు.

విజయ, ఝాన్సీలు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ తో పాటు మోషన్ పోస్టర్, గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే టీజర్‌, ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular