Sunday, June 14, 2026
Homeసినిమాప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.

ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘ఆదిపురుష్‌‘. ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు. ఈ మూవీ టీజర్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ టీజర్ లో గ్రాఫిక్స్ చూసిన జనం ఇది బొమ్మల సినిమాలే ఉందే అని కామంట్లు చేయడం జరిగింది. దీంతో ఆలోచనలో పడిన మేకర్స్.. గ్రాఫిక్స్ మరింత క్వాలిటీగా వచ్చేందుకు మళ్లీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.

జనవరిలో విడుదల కావాల్సిన ఆదిపురుష్‌ మూవీని జూన్ లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. వాయిదా పడడం కంటే ముందుగానే ‘సలార్’ మూవీ సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. జూన్ 16న ఆదిపురుష్‌, సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలకు రెండు నెలలు గ్యాప్. ఇంత తక్కువ గ్యాప్ లో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రావని.. ఆదిపురుష్ మళ్లీ వాయిదా పడడం ఖాయమని టాక్ వచ్చింది. ఇటీవల మేకర్స్ ఖచ్చితంగా జూన్ 16న విడుదల అవుతుందని ప్రకటించారు.

ఆదిపురుష్ జూన్ 16న వస్తే.. సలార్ సెప్టెంబర్ 28న కాకుండా వాయిదాపడే ఛాన్స్ ఉందని ప్రచారం ఊపందుకుంది. ఎట్టకేలకు వీటి పై క్లారిటీ వచ్చింది. సలార్ సినిమాకు సంబంధించి విడుదల తేదీని మరోసారి కన్ ఫర్మ్ చేశారు మేకర్స్. ఇంతకు ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 28న సలార్ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నారు. ఈ మేరకు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. #SalaarEuphoriaIn250Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయిందో, ప్రభాస్ ఫ్యాన్స్ మనసుల్లో ఉన్న అనుమానాలు, భయాలు పటాపంచలయ్యాయి. ఈ సంవత్సరంలో అది కూడా రెండు నెలల గ్యాప్ లో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. ఇక అభిమానులకు పండగే.

Also Read : ఆదిపురుష్‌ పై అదనంగా 100 కోట్ల భారం? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular