Saturday, June 13, 2026
HomeTrending Newsసచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం: యూపీ సిఎం సలహాదారు

సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం: యూపీ సిఎం సలహాదారు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో చేస్తున్న అభివృద్ధిని, ఆయా రంగాల పనితీరు మెరుగుపరుస్తున్న తీరు స్ఫూర్తి దాయకమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్‌ మిశ్రా కితాబిచ్చారు.  చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసినీయమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటర్, డాక్టర్‌ వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాల పనితీరును సాకేత్‌ మిశ్రా పరిశీలించారు. అనంతరం సిఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను సాకేత్‌ మిశ్రా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సాకేత్ మిశ్రా అభిప్రాయాలు ఆయన మాటల్లోనే….

  • ప్రజలకు వైద్య సేవలు అందించడానికి, వారి ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడానికి ఐటీ, సహా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం బాగుంది.
  • గ్రామ సచివాలయ వ్యవస్ధ అనేది ఒక విప్లవాత్మకమైన, గొప్పదైన కాన్సెప్ట్‌ గా భావిస్తున్నాను.
  • ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు తెలిసేలా ప్రచురించాలి, ప్రసారం చేయాలి.
  • వీటిలో మెరుగైన అంశాలను ఇతర రాష్ట్రాలు తీసుకుని, వాటి నుంచి లబ్ధిపొందేందుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.
  • ప్రతి రాష్ట్రం కూడా భిన్నమైనదే. ప్రతి రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నేర్చుకోవాల్సింది ఉంటుందని నా అభిప్రాయం.
  • గ్రామంలో ప్రభుత్వ సేవలపై ఎవరికి ఏ అవసరం వచ్చినా పలు రకాల ఆఫీసులు తిరిగేకన్నా, గ్రామ సచివాలయం కేంద్రంగా అన్నింటికి పరిష్కారం లభించడం విప్లవాత్మక ప్రగతిగా భావిస్తున్నాను.
  • అన్ని ప్రభుత్వ వ్యవస్థలు గ్రామంలో ఒక కేంద్రంలో సమన్వయం చేసుకోవడం అన్నది హర్షిందగ్గ విషయం. టెక్నాలజీని అన్ని రంగాలలో సమర్ధంగా వినియోగిస్తున్నారు.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో బహుళ కార్యక్రమాలకు కేంద్రంగా అక్కడున్న వనరులను వాడుకుంటున్న తీరు చాలా గొప్పది. ఏపీలో పర్యటన ద్వారా చాలా నేర్చుకున్నాను.
  • రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్న డ్రోన్‌ల వ్యవస్థ ఆకట్టుకుంది. కేవలం పది నిముషాలలోనే ఎకరంలో పురుగుమందుల పిచికారి చేయడం గొప్ప విషయం.
  • రైతుకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు ఇలా ప్రతిదీ కూడా ఒక్క చోట లభ్యమవడం అన్నది గొప్ప మార్పు.
  • విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు పూర్తిగా ఆర్‌బీకేలు సేవలందించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
  • రైతులు ఇ–క్రాపింగ్‌ ద్వారా ముందస్తుగా రిజిస్టర్‌చేసుకోవడం, అంతేకాకుండా పంట విక్రయం సమయంలో తాను ఎంత పరిమాణంలో అమ్ముతున్నాను, ఎంత రేటు వస్తుందనే విషయం వారికి అక్కడే తెలియడం చాలా బాగుంది.
  • ఆర్బీకేల్లో రైతులు పంటను విక్రయించాక అక్కడితో రైతు పని ముగుస్తుంది, ఆతర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం కూడా బాగుంది.
  • పంటలకు ఏదైనా విపత్తు వచ్చినా ఆదుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధర కల్పించడం ఇలా ప్రతి విషయంలో కూడా రైతుకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ చర్యలు చాలా బావున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular