Monday, June 15, 2026
Homeసినిమాఆస్కార్ బరిలో నాటు నాటు.. జక్కన్న రియాక్షన్ ఏంటి..?

ఆస్కార్ బరిలో నాటు నాటు.. జక్కన్న రియాక్షన్ ఏంటి..?

‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడంతో దర్శకధీరుడు రాజమౌళి తన ఆనందాన్ని ఓ ప్రకటన రూపంలో తెలియచేశారు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే… నా సినిమాలో మా పెద్దన్న (కీరవాణి) తన పాటకు గాను ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంత కంటే ఇంకేం కావాలి.? ఇప్పుడు నేను తారక్, చరణ్ లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్… ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను.

ఈ పాట విషయంలో చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థాంక్యూ భైరి బాబు. ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టయిల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే.. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నాను. ఛాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్!

అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్ కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలి. అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. ఇక సోషల్ మీడియాలో రోజులో 24 గంటలూ ఆర్ఆర్ఆర్ కు, నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్ కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం… థాంక్యూ!” అంటూ రాజమౌళి తన మనసులో మాటలు బయటపెట్టారు.

Also Read : ఆస్కార్ నామినేషన్ కు ‘నాటు నాటు’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular