Thursday, June 18, 2026
Homeసినిమాసంక్రాంతి బరిలో ప్రభాస్..?

సంక్రాంతి బరిలో ప్రభాస్..?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, స్పిరిట్ చిత్రాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగతో చేయనున్న స్పిరిట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాలతో పాటు ఊహించని విధంగా ప్రభాస్ మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఇదేదో గాసిప్ అనుకున్నారు. ఆతర్వాత షూటింగ్ స్టార్ట్ కావడంతో ఇది నిజమే అని కన్ ఫర్మ్ అయ్యింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఫిబ్రవరి నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తయింది. ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారనే విషయం మీద అధికారిక ప్రకటన రాలేదు. అసలు ఈ సినిమా ప్రారంభించిన విషయం కూడా అనౌన్స్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాతో పాటు రామ్ చరణ్‌, శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్, మారుతి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు రావడం ఆసక్తిగా మారింది. వచ్చే సంక్రాంతికి చరణ్‌, శంకర్ మూవీ, పుష్ప 2, ప్రభాస్, మూరుతి మూవీ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడుతుంది. మరి.. ప్రచారంలో ఉన్నది నిజం అవుతుందో లేదో చూడాలి.

Also Read : అందుకే ప్రభాస్ అలా ప్లాన్ చేశాడట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular