తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్రకు హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి బయలు దేరారు. జూబ్లీ హిల్స్ లోని నివాసంలో బంధు మిత్రుల అభినందనలు అందించారు. తల్లిందండ్రులు భువనేశ్వరి, చంద్రబాబులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అత్తామామలు నందమూరి వసుంధర బాలకృష్ణ లు అల్లుణ్ణి ఆశీర్వదించారు. అనతరం లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తిలకం దిద్ది యాత్రకు సాగనంపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఇంటినుంచి భారీ ర్యాలీతో నెక్లెస్ రోడ్ లోని తన తాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి అనతరం కడపకు బయల్దేరి వెళ్ళారు. కడపలో లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అమీర్ పీర్ దర్గాను సందర్శించి, ఆ తర్వాత ఆర్సిఎం చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్తారు. రాత్రికి తిరుమలలో బసచేసి రేపు శ్రీవారిని దర్శించుకొని రాత్రికి కుప్పం చేరుకుంటారు.
ఎల్లుండి ఉదయం 11.20 గంటలకు వరదరాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తన యాత్రను లోకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారు.