Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన సిరివెన్నెల కుటుంబం

సిఎంను కలిసిన సిరివెన్నెల కుటుంబం

సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, పద్మశ్రీ  సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  సిరివెన్నెల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సమయంలో ఆదుకున్నందుకు సీఎం జగన్‌ కు కృతజ్ఞతలు తెలియ జేశారు. దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

సిరివెన్నెల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.

సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు సిఎం జగన్‌ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.  సీఎంని కలిసిన వారిలో సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular