Friday, March 20, 2026
Homeసినిమానిరాశలో పవన్ ఫ్యాన్స్

నిరాశలో పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ స్టేజ్ లోనే ఉంది.

ఇటీవల రామోజీ ఫిలింసిటీలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏఎం రత్నం రిపబ్లిక్ డే సందర్భంగా వీరమల్లు నుంచి టీజర్ రానుందని.. ఈ టీజర్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. రిపబ్లిక్ డే వచ్చింది కానీ.. వీరమల్లు టీజర్ రాలేదు. అలాగే నాన్ స్టాప్ గా వీరమల్లు షూటింగ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది. అవును వీరమల్లుకి కేటాయించిన డేట్స్ లో కొన్ని వినోదాయ సీతం రీమేక్ కోసం ఇస్తున్నాడట పవన్.

ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ రీమేక్ కోసం పవన్ ఇరవై రోజుల డేట్స్ ఇచ్చాడని సమాచారం. అయితే.. వీరమల్లును పక్కన పెడుతూ ఇలా మరో షూటింగ్ కి వెళ్తూనే ఉన్నాడు పవన్. అసలే పొలిటికల్ మీటింగ్స్ పైగా మధ్యలో షూటింగ్ పవన్ ఫుల్ బిజీ. మరి వీరమల్లు మరో షెడ్యూల్ ఎప్పుడు మొదలువుతుందో ? అనే డైలమాలో మేకర్స్ ఉన్నారు. ఇలా బ్రేకులు పడుతూ పోతే హరి హర వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుందో..? ఎప్పుడు విడుదల అవుతుందో..? పాపం.. క్రిష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular