Tuesday, June 16, 2026
HomeTrending Newsస్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై బిఆర్ఎస్ ఆందోళన

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై బిఆర్ఎస్ ఆందోళన

ప్రముఖ వాణిజ్య సంస్థ అదాని గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత, ఎల్ ఐసీ, ఎస్ బిఐ మరియు ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ప్రతీ భారతీయుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్ , దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దీంతో పాటు దీని ద్వారా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరపున మాట్లాడాలని కోరారు. అదాని గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదికపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular