Sunday, June 14, 2026
Homeసినిమాఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

ఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

ఎన్టీఆర్, కొరటాల శివ.. వీరిద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ మూవీ రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంటుంది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. నవంబర్ లో సెట్స్ పైకి వెళుతుంది అన్నారు.. స్టార్ట్ కాలేదు. ఆతర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అన్నారు కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు.

అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుంది..? ఎప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేస్తారని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే… జనవరిలో స్టార్ట్ చేయాలి అనుకున్నారట. అయితే..
ఆస్కార్ ఫంక్షన్ కు వెళ్లాలి అనుకుంటే మళ్లీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాలి. అందుకే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ప్రారంభించి చిన్న షెడ్యూలు చేయడం కానీ లేదా మార్చి నుంచి పెద్ద షెడ్యూలు చేయడం కానీ అన్న డిస్కషన్లు సాగుతున్నాయని తెలిసింది. అయితే.. ఎప్పుడు స్టార్ట్ అయినా.. వన్స్ స్టార్ట్ అయ్యాక చకచకా షూట్ చేయాలనే దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని సమాచారం.

శంషాబాద్ సమీపంలో ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్ లో ఓ లెంగ్తీ షెడ్యూలు చేసిన తరువాత గోవాలో మరో షెడ్యూలు ప్లాన్ చేస్తున్నారు. గోవా షెడ్యూలు తర్వాత మళ్లీ హైదరాబాద్ షెడ్యూలు వుంటుందట. ఎన్టీఆర్ కోసం మాంచి పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసారు కొరటాల. ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో మాంచి కసి మీద వున్నారు. అందువల్ల స్క్రిప్ట్ దశలోనే చాలా కసరత్తు చేశారు. ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని పట్టుదలతో కొరటాల వర్క్ చేస్తున్నారు. 2024లో ఈ సినిమా రానుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్, కొరటాల ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.

Also Read : ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న భారీ పోర్టు సెట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular