రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆయన నేరుగా ప్రజలతో మమేకం కానున్నారు. పల్లె నిద్ర’ పేరుతో గ్రామాలను సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నారు.
గ్రామ పర్యటన తరువాత ఆ రాత్రికి అదే పల్లెలో నిద్ర చేయనున్నారు. ఏప్రిల్ నుంచి మొదలు కానున్న ఈ యాత్రకు అధికారులు, అధికార వైఎస్సార్ పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండలంలో ఒకట్రెండు పల్లెలను ఎంచుకుని అక్కడే ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
జగన్ ఏడాది క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావించినా ఎప్పటికప్పుడు కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో ఇకపై సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం తో పాటు, పార్టీ బలోపేతం దిశగా శ్రేణులను కూడా క్రియాశీలం చేయాలని సిఎం జగన్ భావిస్తున్నారు.