ఎమ్మెల్యేల కోనుగోలు కేసును లంచ్ మోషన్ లో హైకోర్టు విచారణకు చేపట్టింది. పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. సీబీఐ FIR నమోదు చేసిందా అని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన హైకోర్టు…ఇంకా కేసు సీబీఐ నమోదు చేయలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ వివరించారు. సీబీఐ కేసు నమోదు చేయాలని, కేసు డైరీ పై ఒత్తిడి చేస్తుందని హైకోర్టుకి తెలిపిన అడ్వకేట్ జనరల్.
సుప్రీంకోర్టుకి వెళ్ళేందుకు ఎంత సమయం పడుతుందన్న హైకోర్టు సింగల్ బెంచ్ ప్రశ్నకు వారం సమయం కావాలని ఏజీ కోరారు. పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరమని సింగిల్ బెంచ్ చెప్పగా రేపు ఉదయం చీఫ్ జస్టిస్ ముందు అనుమతి కోరుతామన్న ఏజీ. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.