తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2023 పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష.. మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మా పరీక్ష జరగనుంది. ఎంసెట్ 2023తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
మే 18న (TS Edcet 2023) ఎడ్‌సెట్ 2023 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 20న (TS Ecet 2023) ఈసెట్ 2023.. మే 25న (TS LAWCET 2023) లాసెట్ 2023, పీజీ ఎల్‌సెట్ 2023.. మే 26, 27న (TS ICET 2023) ఐసెట్ 2023.. మే 29 నుంచి జూన్ 1 వరకు (TS PGECET 2023) పీజీ ఈసెట్ 2023 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది.
పరీక్ష తేదీలు:
# మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
# మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష
# మే 18న ఎడ్‌సెట్ 2023 పరీక్ష
# మే 20న ఈసెట్ 2023 పరీక్ష
# మే 25న లాసెట్ 2023 పరీక్ష, పీజీ ఎల్‌సెట్ 2023 పరీక్ష
# మే 26, 27న ఐసెట్ 2023 పరీక్ష
# మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ 2023 పరీక్షలు