Thursday, June 11, 2026
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో విక్రమ్?

ఎన్టీఆర్ మూవీలో విక్రమ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఈనెల 20న మొదలవుతోంది.  గతంలో వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సంచనల విజయం సాధించింది.  దీంతో తాజా సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. కొరటాల శివ కథకు తగ్గట్టుగా బలమైన నటీనటులను ఎంచుకుంటారు. గతంలో మిర్చి సినిమాలో సత్యరాజ్ ను, జ‌నతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ను అలాగే తీసుకువచ్చారు. ఆచార్యలోకి రామ్ చరణ్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా చేయబోతున్న ఎన్టీఆర్ సినిమా కూడా అలాంటి ఫీట్ నే చేయబోతున్నారని తెలిసింది. అసలే పాన్ ఇండియా భారీ సినిమా. అందుకే తమిళ, హిందీ రంగాల నటుల పేర్లు పరిశీలిస్తున్నారు. సినిమాలో ఓ కీలకమైన పాత్రకు తమిళ హీరో విక్రమ్ ను తీసుకురావాలనే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయని వార్త బయటకు వచ్చింది.

విక్రమ్ ఈ మూవీలో నటించడం కుదరకపోతే.. బాలీవుడ్ నుంచి సైఫ్ ఆలీఖాన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారట. అయితే.. సమస్య ఏంటంటే.. ఆ నటులు ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడంతో పాటు డేట్ లు అడ్జెస్ట్ కావాలి. ఈ మూవీని నవంబర్ లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయాలి. అందుచేత.. ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పి.. కొరటాల అడిగినన్ని డేట్స్ వరుసగా ఎవరు ఇస్తారో అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్నట్టుగా విక్రమ్ కానీ.. సైఫ్ ఆలీఖాన్ కానీ నటిస్తే.. ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular