Monday, June 15, 2026
Homeసినిమాహిట్ కోసమే మాళవిక నాయర్ వెయిటింగ్! 

హిట్ కోసమే మాళవిక నాయర్ వెయిటింగ్! 

తెలుగు తెరపై అందాల చందమామలా కనిపించే కథానాయికలలో మాళవిక నాయర్ ఒకరు. కలువ మొగ్గల్లాంటి కళ్లతో చూపులతోనే కట్టిపడేసే అతి తక్కువమంది కథానాయికలలో ఆమె కనిపిస్తుంది.ఏ ఆర్టిస్టుల కాంబినేషన్లో చేసినా ఆడియన్స్ చూపులన్నీ ఆమెపైనే ఉంటాయి. అలాంటి ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అలాంటి మాళవిక 2012లోనే ‘ఉస్తాద్ హోటల్’ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె జర్నీ కొనసాగుతూనే ఉంది.

2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. ఆ తరువాత చేసిన ‘విజేత’ .. ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలు, ఆమె గ్రాఫ్ ను మరింత పడేశాయి. విక్రమ్ కుమార్ ‘థ్యాంక్యూ’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమాలో ఆమె ట్రాక్ కి ఎక్కువ మార్కులు పడటం గమనించవలసిన విషయం.

ఆ తరువాత మాళవిక చేసిన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’ రెడీ అవుతోంది. గతంలో నాగశౌర్య జోడీగా ‘కల్యాణ వైభోగమే’ చేసిన మాళవికకు ఆయన సరసన ఇది రెండో సినిమా. కొంత సేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ‘ఉగాది’ పాండుగా సందర్భంగా మార్చి 17వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమాతోనైనా ఆమెకి హిట్ పడుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular