కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజూ పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ , ’18 పేజెస్’ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటించింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 18న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ఇప్పటి వరకు కిరణ్ చేసింది తక్కువ చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తను నటించిన “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా విషయానికి వస్తే.. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఇది వరకే కిరణ్ కి “ఎస్.ఆర్ కల్యాణమండపం” సినిమాకి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో పాటలను రచించారు.
ఈ చిత్రంలోని పాటలన్నింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తుంది. కిరణ్ కు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నారు.