Sunday, November 24, 2024
HomeTrending Newsమూతపడ్డ ఫైనాన్స్ కొత్త అవతారమే బీఆర్ఎస్ - బండి సంజయ్

మూతపడ్డ ఫైనాన్స్ కొత్త అవతారమే బీఆర్ఎస్ – బండి సంజయ్

గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ‘‘రాష్ట్రంలోని పంచాయతీలకి  నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ… బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు. మహేశ్వరం మండలం అమీర్ పేటలో బుధవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, మండలాధ్యక్షులు మాధవాచారి, సర్పంచ్ శ్రీశైలం, నందీశ్వర్, యాదీశ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….

• బీఆర్ఎస్ పార్టీ ముంచిన ఫైనాన్స్ కొత్త దుకాణమే. బీఆర్ఎస్ కు కార్యవర్గమే లేదు. ఇతర రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులంతా చెల్లని కాసులు. మునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో బూత్ కు ఒక్కో ఎమ్మెల్యే, మంత్రిని నియమించిన టీఆర్ఎస్ కు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ చాలు.

• టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టానికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మీటింగులు పెట్టి బీజేపీ దమ్మేందో చూపిస్తున్నాం.

• మహేశ్వరంలో టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇండ్లకు నిధులిస్తే… కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకుండా నిధులను దారి మళ్లించింది.

• రైతులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందజేస్తోంది. ఎకరాకు సగటున రూ.30 వేల మేరకు సబ్సిడీపై యూరియా అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే.

• రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నా… రాష్ట్రంలో రైతులకు వర్తింపజేయకుండా మోసం చేస్తున్నారు.

• బీఆర్ఎస్ మాదిరిగానే నరేంద్రమోదీ సైతం బీజేపీలో చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే…. బీఆర్ఎస్ లో ఒక్క సర్పంచ్, జడ్పీటీసీ సహా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి మిగిలేవారు కాదు… పక్షపాతానికి తావులేకుండా దేశంలోని పంచాయతీలకు నరేంద్రమోదీ నిధులిస్తున్నారు. తెలంగాణకు సైతం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే… కేసీఆర్ మాత్రం సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారు.

• లిక్కర్ దందా పేరుతో దొంగ సారా దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డ కవితను అరెస్ట్ చేస్తే తప్పేముంది? తప్పుడు పనులు చేస్తున్న బిడ్డకు బుద్ది చెప్పకుండా గగ్గోలు పెట్టడమేంది?

• కేసీఆర్… నువ్వు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు అమీర్ పేటకు వచ్చి చెప్పే దమ్ముందా? నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే… నువ్వు మగోడివైతే ఊర్లలోకి వచ్చి ఆ మాట చెప్పే ధైర్యముందా?

• ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ నేతలతో కలిసి వక్ఫ్ భూములను కబ్జా చేస్తూ భూదందా చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారు.

• ఎంఐఎం నేతలు నిజంగా ఇస్లాం మతం కోసం పనిచేస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అమ్ముడుపోకపోతే దమ్ముంటే మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయాలి. అట్లాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో పోటీ చేయాలి. డిపాజిట్లు లేకుండా చేసి తీరుతాం. ఎంఐఎం నేతలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఎన్నికలకు ముందు పోటీ చేస్తామంటూ బీరాలు పలికి… డబ్బులు దండుకున్నాక పాతబస్తీకే పరిమితమవుతారు.

Also Read : గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలి – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్