Thursday, June 18, 2026
Homeసినిమాఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' - కిరణ్ అబ్బవరం

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ – కిరణ్ అబ్బవరం

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కించిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా,  క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ “వినరో భాగ్యము విష్ణు కథ” థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… ‘సక్సెస్ మీట్‌లు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. సినిమా ఆడకపోతే.. నేను బయటకు కనిపించను. ఆడియెన్స్‌ ఇచ్చే రిజల్ట్‌ను నేను గౌరవిస్తాను. ఇప్పటి వరకు నేను ఐదు సినిమాలు చేశాను. ఏ సినిమా గురించి కూడా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే మాట నుంచి ఈ సినిమా మొదలవుతుంది. పిల్లలను ఎలా పెంచాలి.. ఎలాంటి మాటలు చెప్పాలి అని తెలియజేసేదే విష్ణు కథ. ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చాలా మంచి సినిమాను తీశాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. మంచి మాటలు వింటారు. దేశం గురించి చెప్పాం. మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను చూసి ఇంత ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

Also Read : ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు సీక్వెల్ ఉందండోయ్! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular