Sunday, June 14, 2026
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి

పఠాన్ చెరువు నియోజకవర్గం  భారతి నగర్ వార్డ్ లో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ, పల్లె ప్రజలు ఎంతో ప్రగతిని సాధించారన్నారు.

హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో అభివృద్ధి చెందిందని, పట్టణాల్లో ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన కాయకూరల్ని  అందించడానికి తెలంగాణ సర్కారు మోడల్ రైతు బజార్ లను నిర్మిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్,స్థానిక నేతలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular