Friday, June 12, 2026
Homeసినిమా బాలయ్య షో గురించి చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

 బాలయ్య షో గురించి చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా  ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో  ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షోగా నిలిచింది. పవన్, ప్రభాస్ ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడడం అభిమానులు విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య, చరణ్ మధ్య జరిగిన సంభాషణ అయితే.. అటు బాలయ్య, ఇటు చిరంజీవి అభిమానులకు బాగా నచ్చింది.

అయితే… అమెరికా లో ఉన్న రామ్ చరణ్ అక్కడి ప్రముఖ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో పాల్గొని సందడి చేసారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక తెలుగు మీడియా ఛానల్స్ తో చరణ్ మాట్లాడారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్, పవన్ ఎపిసోడ్స్ ఫోన్ కన్వర్జేషన్ లో పాల్గొన్న అనుభవం ఎలా అనిపించింది అని అడుగగా, నిజంగా అన్ స్టాపబుల్ షో తనకు ఎంతో నచ్చిందని, బాలకృష్ణ గారి హోస్టింగ్ అదిరిపోయిందని చరణ్‌ చెప్పారు.

తనకు ఆహ్వానం వస్తే… ఆ షోకి ఖచ్చితంగా వెళతానన్నారు. చరణ్  కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరణ్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. అన్ స్టాపబుల్ లో ఎప్పుడు పాల్గొంటాడు, ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Also Read : అన్‌ స్టాపబుల్ 2’లో వెంకటేష్ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular