Saturday, June 13, 2026
Homeసినిమావిశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ పూర్తి

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ షూటింగ్ పూర్తి

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా ‘దాస్ కా ధమ్కీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది.  విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా కావడం విశేషం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ కి ధమ్కీ చిత్రం ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular