Thursday, June 11, 2026
Homeసినిమాచరణ్‌ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఏంటో తెలుసా..?

చరణ్‌ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఏంటో తెలుసా..?

‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చరణ్‌.. ఎన్టీఆర్ అద్భుతంగా నటించడంతో మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం వీరిద్దరికీ మంచి పేరు వచ్చింది. మూవీ గోల్డన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడం.. ఆస్కార్ బరిలో నిలవడంతో.. మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్ కోసం అక్కడ బాగా ప్రమోట్ చేస్తున్నారు. చరణ్‌ ఇటీవల అమెరికా వెళ్లారు. అక్కడ అంతర్జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ… పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్ వ్యూలో భాగంగా తన ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాల గురించి చెప్పాడు.

ఇంతకీ చరణ్‌ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ ఏంటంటే… హాలీవుడ్ నుంచి అయితే ది నోట్ బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ది ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ అలాగే జేమ్స్ కెమరూన్ టెర్మినేటర్ 2 సినిమాలు బాగా ఇష్టం అని వాటిలో టెర్మినేటర్ 2 చాలా ఎక్కువ సార్లు చూశానని తెలిపాడు. ఇక ఇండియన్ సినిమా లో అయితే.. దాన వీర శూర కర్ణ, మిస్టర్ ఇండియా, రంగస్థలం, బాహుబలి సినిమాలు బాగా ఇష్టం అని చెప్పారు. చరణ్ తన ఆల్ టైం ఫెవరెట్ సినిమాల లిస్ట్ ని ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ప్రస్తుతం చరణ్‌… శంకర్ తో మూవీ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత నర్తన్ తో కానీ… సుకుమార్ తో కానీ చరణ్‌ సినిమా చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి లైనప్ బాగుంది. మరి.. చరణ్‌ ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular