Sunday, November 24, 2024
Homeసినిమాఎన్టీఆర్ గురించి చరణ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ గురించి చరణ్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ భారీ, క్రేజీ మూవీ 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాగే జపాన్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజైన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న.. ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీపడుతుంది. త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న రామ్ చరణ్, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే అక్కడ ఫ్యాన్స్ ని కలుస్తున్నారు.

లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ అయిన సందర్భంగా యుఎస్ఏ లోని థియేటర్ లో సందడి చేసిన చరణ్, ఫ్యాన్స్ పలు సన్నివేశాల్లో లేచి నిలబడి తమ సీన్స్ ని అభినందించిన తీరుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఇక లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పలు ఆర్ఆర్ఆర్ తో పాటు తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. మగధీరకి మాత్రమే కాదు ఆర్ఆర్ఆర్ కి కూడా తాను స్టూడెంట్ నే అని, రాజమౌళి గారిని కలిసిన ప్రతి సారీ ఎంతో నేర్చుకున్నానని, నిజానికి ఆర్ఆర్ఆర్ కి ముందు కొంత గ్యాప్ తీసుకుందాం అని భావించినప్పటికీ అదే సమయంలో ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి కలిసారని అన్నారు.

ఇక తన సోదర సమానుడు ఎన్టీఆర్ ని తాను ఈ సందర్భంగా మిస్ అవుతున్నానని అన్నారు. కారణాలు చెప్పలేనప్పటికీ ఇన్నేళ్ల పాటు తాను ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో ఎక్కువుగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయానని, ఇద్దరం కలిసి ఆర్ఆర్ఆర్ చేసిన సమయంలో మా ఇద్దరి మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఏర్పడిందని అన్నారు. మా ఇద్దరినీ హీరోలుగా పెట్టి ఆర్ఆర్ఆర్ తీసినందుకు రాజమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కి ప్రత్యేక పనులు ఉండడం వలన ఇక్కడికి రాలేదని, తాను ఎప్పటికీ నా ప్రక్కనే ఉండాలని కోరుకుంటున్నానని చరణ్ అన్నారు.

Also Read : జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన చరణ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్