మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ కావడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇందులో మహేష్ బాబుకు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో జగపతి బాబు నెగటివ్ రోల్ చేస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ నటిస్తున్నారు.
ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే… రానున్న ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 28వ మూవీని ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. చెప్పిన డేట్ కి సినిమాను విడుదల చేయడం కోసం మహేష్ బాబు షూటింగ్ కి ఉదయం 7 గంటలకే వచ్చేస్తుండడం విశేషం.
పుట్టినరోజున రాజమౌళితో చేయనున్న మూవీని ప్రకటించనున్నారు. ఇలా ఈ పుట్టినరోజుకు త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ రిలీజ్ కావడం ఓ ట్రీట్ అనుకుంటే.. రాజమౌళితో చేయనున్న మూవీని అనౌన్స్ చేయడం మరో ట్రీట్ అనుకోవచ్చు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తీయనున్నారు. ఈ విధంగా మహేష్ బాబు పుట్టినరోజున అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు మహేష్ బర్త్ డే వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.