Tuesday, June 16, 2026
Homeసినిమాతెలుగు తెరపై జాన్వీ సొగసుల సందడి మొదలైనట్టే!

తెలుగు తెరపై జాన్వీ సొగసుల సందడి మొదలైనట్టే!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇంతవరకూ చేసిన సినిమాలూ తక్కువే, ఆ సినిమాల ద్వారా ఆమెకి వచ్చిన క్రేజూ తక్కువే. ఇంతవరకూ ఆమెకి చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్ పడలేదు. అలాంటి ఒక హిట్ కోసమే కొంతకాలంగా ఆమె వెయిట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ .. జిమ్ దగ్గరో .. షాపింగ్ దగ్గరో కురచ దుస్తులతో కనిపిస్తూ ఆ క్రేజ్ తోనే నెట్టుకొస్తోంది. ఆమె హాట్ లుక్స్ కి ఒక రేంజ్ లోనే ఫాలోయింగ్ ఉంది.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి చెందిన మిగతా భామలంతా టాలీవుడ్ పై కన్నేశారు. టాలీవుడ్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియాగా మారిపోవడంతో, తెలుగు నుంచి వెళ్లిన ఏ ఛాన్స్ ను ఏ కథానాయిక మిస్ చేసుకోవడం లేదు. అలా ఇప్పటికే ఇక్కడికి అలియా .. కియారా .. అనన్య పాండే వంటివారు దిగిపోయారు. రేపో మాపో ఇక్కడి తెరపై దీపికా పదుకొణె కూడా కనిపించనుంది. దాంతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఎప్పుడు ఉండనుందా అని ఇక్కడి ఫ్యాన్స్ అంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

అయితే తనకి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని చెబుతూ ఊరిస్తూ వచ్చిన జాన్వీ, ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇది నిజమేనని చెబుతూ ఆమె బర్త్ డే రోజున రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ సినిమా టీమ్ ఖరారు చేసింది. కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీదేవి కూతురుగా జాన్వీ పట్ల ఇక్కడివారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ ప్రాజెక్టుకి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐక్య ఇక్కడ ఆమె దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular