Wednesday, June 17, 2026
Homeసినిమాచరణ్‌ హాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా..?

చరణ్‌ హాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా..?

రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ మూవీతో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఒక్క మూవీతో గ్లోబల్ స్టార్ట్ అయ్యాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్‌ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఎక్కడకు వెళ్లినా చరణ్ కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే.. చరణ్‌ హాలీవుడ్ పత్రికలకు ఇంటర్ వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్లు అడిగే ప్రశ్న హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? అని.. త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని.. అందుకు రంగం సిద్ధమైందని సమాధానం చెప్పడం ఆసక్తిగా మారింది.

నటుడిగా భాష, ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని దేశాల చిత్రాల్లోనూ నటించాలని ఉంది. త్వరలో హాలీవుడ్ ఎంట్రీ సినిమాకి సంబంధించి అన్ని విషయాలు చెబుతాను. ప్రస్తుతానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చరణ్ అన్నారు. అంతే కాకుండా… టెర్మినేట‌ర్‌, గ్లాడియేట‌ర్‌, బ్రేవ్ హార్ట్ చిత్రాలంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆ జోన‌ర్‌లో క‌థ వ‌స్తే.. చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. జూలియా రాబ‌ర్ట్స్  అభిమాన న‌టి. ఆమెతో క‌లిసి అతిథి పాత్ర‌లో అయినా స‌రే.. న‌టించాల‌ని ఉంది అని హాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్‌ పై త‌న అభిమానం ప్ర‌ద‌ర్శించాడు మెగా పవర్ స్టార్.

చ‌ర‌ణ్ ఇలా చెప్పడం చూస్తుంటే.. త‌న‌కేదో భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్నాడు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఎవరితో సినిమా ఉంటుంది అనేది ప్రకటించలేదు. అందుచేత ఈ రెండు సినిమాల తర్వాత హాలీవుడ్ మూవీ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular