Wednesday, June 17, 2026
Homeసినిమామహేష్‌.. అర్జున్ తరహా మూవీ  చేస్తున్నాడా..?

మహేష్‌.. అర్జున్ తరహా మూవీ  చేస్తున్నాడా..?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. అయితే.. ముందుగా ఈ సినిమా కోసం యాక్షన్ స్టోరీ అనుకున్నారు. ఆతర్వాత కథ మారింది. ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఫిక్స్ అయ్యారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తున్నారు. మహేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింతగా చేరువ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలిసింది.

అయితే… ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే.. ఈ సినిమా కోసం సిస్టర్ సెంటిమెంట్ ని మూలకథగా తీసుకున్నారట.  ఈ సిస్టర్ సెంటిమెంట్ ని కాస్త అడ్వాన్స్ లెవల్లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా.. ఈ కథకు మహేష్ నటించిన బాలచంద్రుడు సినిమా స్పూర్తి అని వినిపిస్తుంది. త్రివిక్రమ్ కథ విషయంలో కొన్నింటిని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా ఇంటి చుట్టూ కథ తిప్పడం.. ఇంట్లోనే ఎక్కువ కథను చెప్పడం… మానవ జీవితంలో చోటు చోసుకునే సమస్యలే కథా వస్తువుగా తీసుకోవడం జరుగుతుంది.

అయితే.. ఈసారి ఫ్యామిలీ ఎమోషన్ కాకుండా  అన్నా-చెల్లి బాండింగ్ విషయంలో కలం కాస్త లోతుగా కదిలినట్లు తెలుస్తుంది కానీ.. ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్ సిస్టర్ సెంటిమెంట్ తో అర్జున్ మూవీ చేశాడు కదా. మళ్లీ సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా చేస్తున్నాడా..? ఇది నిజమేనా అని ఈ కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అభిమానులు. ఉగాది టైటిల్ ప్రకటిస్తారు. అప్పుడు క్లారిటీ వస్తుంది. మరి.. త్రివిక్రమ్.. మహేష్ ని ఎలా చూపించబోతున్నాడో..? ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular