చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దాదాపు 250 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో చిరు రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్‘ మూవీ చేస్తున్నారు. అయితే.. తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. చిరుతో సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్, వినాయక్, వెంకీ కుడుముల తదితరులు ప్రయత్నించారు కానీ.. కథ కుదరకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అందుచేత నెక్ట్స్ చేయబోయే సినిమా కోసం చిరు కథలు వింటూనే ఉన్నారు.
అయితే.. రైటర్ బివిఎస్ రవి చిరంజీవికి కథ చెప్పారని.. కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే.. డైరెక్టర్ ఎవరు అనేదే సమస్య. బివిఎస్ రవి చెప్పిన కథతో చిరు సినిమాను డాటర్ సుస్మిత నిర్మించనున్నారని తెలిసింది కానీ.. దర్శకుడు ఎవరు అన్నదే పాయింట్. బివిఎస్ రవి స్వతహాగా దర్శకుడే కానీ, కథ.. మాటలు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల దర్ళకుడు ఎవరో తేలితే మెగాస్టార్ తరువాత సినిమా తన కూతురు బ్యానర్ లోనే వుంటుంది. ఇది గాక మరో రెండు సంస్థలతో కూడా మెగాస్టార్ సంప్రదింపులతో వున్నారు.
చిరంజీవితో సినిమా చేసేందుకు పూరి, వినాయక్, మలినేని గోపీచంద్ కూడా వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఈ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తారా..? లేక వీరెవరు కాకుండా మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. వినాయక్ అంటే చిరంజీవికి బాగా ఇష్టం. ఆయనతో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందించారు. అందుచేత వినాయక్ కి ఈ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వచ్చు అని ప్రచారం జరుగుతుంది. మరి.. చిరు బివిఎస్ రవి కథను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి ఇస్తారో చూడాలి.