ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేరుగా 15 స్థానాల్లో గెలుపొందింది, టీచర్ల స్థానం నుంచి వైసీపీ మద్దతుతో విజయం సాధించిన ఇద్దరితో కలిపి మొత్తం 17 సీట్లు గెల్చుకున్నట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీ నాలుగు సీట్లలో విజయం సాధించింది. వీటిలో గ్రాడ్యుయేట్ స్థానాలు మూడు, ఎమ్మెల్యే కోటా ఒక సీటు ఉన్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత శాసనమండలిలో బలాబలాలు మారాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య 44కు చేరుకుంది. వీరిలో ఎమ్మెల్యే కోటా-15; స్థానిక సంస్థలు-20; టీచర్లు-3; గవర్నర్ కోటా-6 ఉన్నాయి.
తెలుగుదేశం సభ్యుల సంఖ్య 17నుంచి కి తగ్గింది. వీటిలో ఎమ్మెల్యేల కోటా-5; గ్రాడ్యుయేట్స్-3; గవర్నర్ కోటా-2 ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకూ బిజెపి నుంచి పీవీఎన్ మాధవ్, తెలుగుదేశం నుంచి బిజెపిలోకి మారిన వాకాటి నారాయణ రెడ్డిలు ఉండగా వారిద్దరి పదవీ కాలం ముగిసింది. దీనితో బిజెపి మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..
వైసీపీ, తెలుగుదేశం మినహాయించి మిగిలిన నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు ఇద్దరు గ్రాడ్యుయేట్, మరో ఇద్దరు టీచర్స్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు