Sunday, November 24, 2024
HomeసినిమాRangamarthanda: కంటెంట్ కి మంచి రోజులొచ్చాయ్! 

Rangamarthanda: కంటెంట్ కి మంచి రోజులొచ్చాయ్! 

స్టార్ హీరో .. స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో ఒక సినిమా అనుకుంటే, సపోర్టింగ్ రోల్స్ చేసేవారిని కూడా ఆ స్థాయికి తగినట్టుగానే తెచ్చుకోవాలి. ఇక స్టార్ హీరోతో సినిమా అంటే, ఆయన క్రేజ్ కీ .. బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే కథను సెట్ చేసుకోవాలి. హీరోకి నచ్చినట్టుగా కథను మార్చుకోవాలి. స్టార్స్ తో సినిమా అంటే బడ్జెట్ ఒక రేంజ్ లో ఉంటుంది గనుక, ప్రయోగాలకు వెళితే ప్రమాదాలు జరుగుతాయనే చాలా మంది భావిస్తూ ఉంటారు .. భయపడుతుంటారు.

అదే చిన్న సినిమా అయితే కథను బట్టి పాత్రలు నడచుకుంటాయి .. సందర్భాన్ని బట్టి సన్నివేశాలు కుదురుకుంటాయి. స్టార్స్ ఉండరు గనుక జనాలను థియేటర్స్ కి రప్పించే బాధ్యతను కంటెంట్ భుజాన వేసుకుంటుంది. పబ్లిసిటీ లేకపోయినా మౌత్ టాక్ తోనే జనాలను థియేటర్స్ కి తీసుకురావడానికి కంటెంట్ నడుం బిగించవలసిందే. అదృష్టం కొద్దీ ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు .. చిన్న సినిమాలకి సైతం పెద్ద హిట్లు కట్టబెడుతున్నారు.

గతంలో హీరో .. హీరోయిన్ .. డైరెక్టర్ పేరు చూసి, కొన్ని సందర్భాల్లో బ్యానర్ పేరు చూసి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు .. కంటెంట్ ఉంటే చాలు .. ఆ విషయం బయటికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఆ తరువాత థియేటర్స్ దగ్గర సందడి పెరగడానికి ఎక్కువ రోజులు పట్టడం లేదు . ఇటీవల థియేటర్స్ కి వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ … ‘బలగం’ .. ‘ రంగమార్తాండ’ సినిమాలను ఇందుకు నిదర్శనంగా చెప్పచ్చు. ఇవన్నీ కంటెంట్ తో కాసుల వర్షాన్ని కురిపించినవే. ఇకపై ఇదే ట్రెండ్ కొనసాగుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్