Thursday, June 18, 2026
Homeసినిమాశ్రీనివాస్ బెల్లంకొండ కొత్త సినిమా

శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త సినిమా

యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.  ప్రస్తుతం బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. దీని  తర్వాత నటించే కొత్త చిత్రాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. గ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం మంచి కథ రెడీ చేశాడు. #BSS10 చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular