Thursday, March 19, 2026
HomeసినిమాFilm Fight: రవితేజ, సుశాంత్ తిట్టుకున్నారా?

Film Fight: రవితేజ, సుశాంత్ తిట్టుకున్నారా?

మాస్ మహారాజా రవితేజ, అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. దీంతో రావణాసుర మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో రవితేజ, సుశాంత్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. ఖచ్చితంగా ఆడియన్స్ కి రావణాసుర చిత్రం థ్రిల్ కలిగిస్తుందని… బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇదిలా ఉంటే… రవితేజను సుశాంత్… ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడట. అదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజంగా నిజం. కాకపోతే… సినిమా కోసమే. ఇంకా చెప్పాలంటే…  రవితేజ స్వయంగా ఎంకరేజ్ చేసి మరీ తిట్లు తిట్టించుకున్నాడట. ఇంతకీ మేటర్ ఏంటంటే..  ఒక సీన్ లో రవితేజ పై సుశాంత్ ఫైర్ అవ్వాల్సి ఉంటుందట.

‘నిజంగానే తిట్టాలని అనిపించేలా తిట్టేయ్.. గట్టిగా అరిచెయ్’ అన్నారట రవితేజ. అలా ఆ సీన్ బాగా వచ్చేందుకు కారణమయ్యారట. అలా చేసిన 2 సీన్లు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు సుశాంత్. ఇక ఇదే విషయం మీద రవితేజ కూడా మాట్లాడుతూ… అక్కినేని ఫ్యామిలీ హీరోలు సాఫ్ట్ గా ఉంటారు. అలాంటి వాళ్లతో ఎగ్రెసివ్ సీన్లు చేయించుకోవాలంటే పూర్తి స్వేచ్చ ఇవ్వాలని, అదే తను చేశానని అన్నారు. ఈ సినిమా పై రవితేజ, సుశాంత్ ఇద్దరూ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి.. రావణాసుర ఇద్దరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular