Wednesday, June 17, 2026
HomeసినిమాKajal Agarwal: బాలీవుడ్ పై కాజల్ సంచలన వ్యాఖ్యలు

Kajal Agarwal: బాలీవుడ్ పై కాజల్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ సినిమాల్లో నటించడం అయిపోయిన తర్వాత సెటైర్లు వేయడం.. ఇంకా చెప్పాలంటే.. సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంటుంది. ఇలియానా, తాప్సీ తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. తెలుగు చిత్రాలతో పాటు సౌత్ సినిమాల మీద కౌంటర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి కానీ.. కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడింది. ఈ అందాల చందమామ ముంబయి అమ్మాయే అయినప్పటికీ.. ఆమె సౌత్ ఫిలిం ఇండస్ట్రీలను పొగుడుతూ.. బాలీవుడ్ మీద విమర్శించడం విశేషం.

ఇంతకీ కాజల్ అగర్వాల్ ఏమన్నదంటే… బాలీవుడ్లో నైతిక విలువలు అంటూ ఉండవు. సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణగా ఉంటుంది. ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కు ఎంతో గౌరవం ఇస్తారు అంటూ ఆమె పెద్ద స్టేట్మెంటే ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవలే బాలీవుడ్ మీద అక్కడి స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పెద్ద చర్చ నడుస్తోంది. కాజల్ సైతం ఈ టాపిక్ మీద స్పందించింది. నేను ముంబయి అమ్మాయిని. పుట్టి పెరిగిందంతా అక్కడే కానీ నా కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లో.

తెలుగు, తమిళ సినిమాల్లోనే నేను ఎక్కువగా పని చేశాను. బాలీవుడ్లోనూ కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్, చెన్నైలనే నా నివాస నగరాలుగా భావిస్తాను. అది ఎప్పటికీ మారదు అని చెప్పింది. దక్షిణాది సినీ పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే చాలు ఇక్కడ ఎవరినైనా ఆదరిస్తారు. హిందీ నా మాతృ భాష. నేను హిందీ సినిమాలు చూస్తూనే పెరిగాను కానీ.. దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్లో నైతికత, క్రమశిక్షణ, నైతిక విలువలు లోపించాయని భావిస్తున్నాను అని కాజల్ కామెంట్ చేసింది. ఆమె వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular