Saturday, June 13, 2026
HomeTrending NewsJagadish Reddy:కాంగ్రెస్ కు సోయి లేదు - జగదీష్ రెడ్డి

Jagadish Reddy:కాంగ్రెస్ కు సోయి లేదు – జగదీష్ రెడ్డి

దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరార్థం అయినట్లే నని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఏకంగా పార్లమెంట్ నుండి తొలగిస్తే ఆ పార్టీకీ సోయి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీవచ్చంలా మారింది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కరలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ యస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో బాగంగా సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుఱ్ఱంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పి ఏ పల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుఱ్ఱంపోడులో జరిగిన సమ్మేళనానికి స్థానిక శాసనసభ్యులు నోముల భగత్,పి ఏ పల్లి మండలం అంగడిపేట లో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు,జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు నేనవత్ రవీంద్ర నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ దుర్మార్గాలను నిలువరించేందుకే టి ఆర్ యస్.. బి ఆర్ యస్ గా రూపాంతరం చెందిందన్నారు.

యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు. మహారాష్ట్రతో సహా యావత్ భారతదేశంలో రైతాంగం, రైతు సంఘాల ప్రతినిధులు బి ఆర్ యస్ లో చేరేందుకు బారులు తీరుతున్నారన్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో రైతు విప్లవం మొదలైందని అది మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు చేరుకొని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పూరిస్తున్నారన్నారు. రైతు భీమా కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ లకు చెందిన రైతాంగం గుంట,అరగుంట భూములు కొనుగోలు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ను పొందేందుకు వీలుగా బోర్లు వేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. బిజెపి ఎలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మోడీ ఎలుబడిలో సుదీర్ఘ కాలం ఉన్న గుజరాత్ లో దారిద్య్రం ఆరున్నర శాతం నుండి ఎనిమిదిన్నర శాతానికి పెరగడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు. 27 రాష్ట్రాలలో ఇప్పటికీ ఒక్క పూట పస్తులు ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కపూట బోజనాలకే పరిమితము అయ్యి దేశంలో పస్తులుంటున్న వారి శాతం 35 నుండి 40 శాతానికి చేరుకుందన్నారు. సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల కంటే మన దేశంలో అందులో మోడీ పాలనలోనే దారిద్య్రం పెరిగిపోయిందన్నారు.

Also Read : BRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular