Sunday, November 24, 2024
HomeTrending NewsVandeBharat:కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే - బండి సంజయ్

VandeBharat:కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే – బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్…. దమ్ముంటే నీ MA పొలిటికల్ సైన్స్ సర్టిఫకేట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే… కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీరు…రమ్… స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు. 8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి పరేడ్ మైదానానికి బండి సంజయ్ వచ్చారు.  ఈనెల 8న సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఉదయం 10.30 గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందులోని ముఖ్యాంశాలు..

• ఈనెల 8న వందేభారత్ రైలు ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏం పనిలేదు… కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ బాగా చదువుకున్నారు కదా… దేనికి ఉపయోగపడింది. డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు, కమీషన్లు తీసుకోవడానికే ఉపయోగపడింది. చదువుకున్న అజ్ఝానులు మీరు…

• MA పొలిటికల్ సైన్స్ చదివినని మీ అయ్య చెప్పిండు…. నీకు చేతనైతే ముందు ఆ సర్టిఫికేట్ ను బయట పెట్టు. KCR దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్స్ తయారు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్లున్నడు.

• మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు.. బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా. స్కీంల ద్వారా ఏ విధంగా స్కాంలు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ అంటేనే బీరు, రమ్ము, స్కాచ్ పార్టీ…

• కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే.. ఆయన తాగి పడుకుంటడు.. అన్నీ లీకులే. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం. లీకుల జాతర నడుస్తోంది. అవినీతి సొమ్ముతో పొట్టుపొట్టు పైసలు సంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టారు.

• కేసీఆర్….8 ఏళ్ల క్రితం నీ బతుకేంది. నందినగర్ లో ఓ ఇల్లు మాత్రమే ఉండే . నీ బిడ్డకు అపార్ట్ మెంట్లో అద్దెకుంది. నీ కొడుకుకు ఇల్లేలేదు. ఇప్పుడు వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్?

• నీ దిక్కుమాలిన పాలనలో అన్నీ లీకులే.. కాళేశ్వరం పంపులు లీకేజే… డబుల్ బెడ్రూం ఇండ్ల లీకేజే… ధరణి పోర్టల్ భూముల వివరాలన్నీ లీకులే… టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకులే..

• టెక్నాలజీలో నేను తోపుని చెప్పుకుంటున్న కేసీఆర్ కొడుకు ఏం చేసిండు.. టెక్నాలజీని ఎట్లా లీక్ చేయాలి? దొంగలంతా ఎట్లా టెక్నాలజీని లీక్ చేయాలో నేర్పుతుండా?

• ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతకాదు.. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ట్రిపుల్ ఐటీని నిర్వీర్యం చేశారు. పురుగుల అన్నం తిన్పిస్తున్నరు. ఉద్యోగాల నిర్వహణ చేతగాదు…

• కేసీఆర్ చేసిన అభివ్రుద్ధి ఏంది?…టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేయడమా? కొడుకును, అల్లుడును మినిస్టర్ చేయడమా? కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమా? ఆడవారిపై బిఆర్ఎస్ నాయకుల అఘాయిత్యాలే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి. తెలంగాణ సొమ్మును దోచుకుని దాచుకోవడమే టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి. పేపర్ లీకులతో నిరుద్యోగుల పొట్ట కొట్టడమే బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి. జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగులను వేధించడమే బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి.

• కేసీఆర్ అనేటోడు మనిషే కాదు… ఇంటర్మీడియట్ విద్యార్థులు చస్తే పట్టించుకోని మూర్ఖుడు. టెన్త్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకవుతున్నా నోరు మెదపరు… సిగ్గుండాలే… పేపర్ లీకేజీ కాకుండా అడ్డుకోలేని నిన్ను సీఎంగా ఎట్లా గుర్తించాలి. లీకేజీలో అందరూ బీఆర్ఎసోళ్లే. ఇంకెన్ని పేపర్లు లీకేజీలు కావాలో.. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నవ్.

• వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలి. లేకుంటే కొడుకును బర్తరఫ్ చేసి మెడలు పట్టి గెంటేయాలి. ఒక్కసారైనా నువ్వు రివ్యూ జరిపినవా? నువ్వు కూడా రాజీనామా చేయాలి. విద్యా మంత్రిని రాజీనామా చేయించాలి.

• టీఎస్పీఎస్సీ లీకేజీపై బాధ్యులను శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుంది. వరంగల్ జిల్లాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. లక్షలాది మందితో రాజధానిలోనూ సభ, మార్చ్ నిర్వహిస్తాం…

Also Read : బండి సంజయ్ తెలివి లేని దద్దమ్మ మంత్రి కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్