Wednesday, June 17, 2026
HomeసినిమాSrikanth Odela: డైరెక్టర్ కి బీఎమ్ డబ్ల్యూ తెచ్చిపెట్టిన 'దసరా' 

Srikanth Odela: డైరెక్టర్ కి బీఎమ్ డబ్ల్యూ తెచ్చిపెట్టిన ‘దసరా’ 

ఒక కొత్త దర్శకుడికి ఫస్టు సినిమా టెన్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే కొత్త దర్శకుడిని నమ్మి  చాలామంది హీరోలు ముందుకు రావడానికి ఆలోచన చేస్తారు. అలాగే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు కూడా భయపడతారు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల రూపాయల బిజినెస్ తో ముడిపడి ఉంటుంది. ఏ మాత్రం తేడా కొట్టినా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి అసలు కోలుకునే అవకాశం లేకుండా చేస్తుంది.

అందువల్లనే వచ్చిన ఫస్టు ఛాన్స్ లోనే తాము ఏమిటనేది నిరూపించుకోవడానికి దర్శకులు చాలా కష్టపడతారు. ప్రతికూల పరిస్థితుల్లోను ఆశించిన అవుట్ పుట్ ను రాబట్టడానికి నానా తంటాలు పడుతుంటారు. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని మౌనంగా భరించవలసి ఉంటుంది. అలాంటివన్నీ దాటుకుని థియేటర్స్ కి వచ్చిన సినిమా, ప్రేక్షకుల ఆదరణ పొందవలసి ఉంటుంది.

అలా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల చేసిన ‘దసరా’ సినిమా, వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను ‘కరీంనగర్’లో నిర్వహించారు. ఈ సినిమాను ఇంతటి హిట్ చేసిన సందర్భంగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘బీఎమ్ డబ్ల్యూ’ కారును బహుమతిగా అందజేశాడు. ఈ వేదికపైనే ఆ కారు ‘కీ’ని ఆయన చేతుల్లో పెట్టాడు. మొత్తానికి ఫస్టు సినిమాతోనే ఖరీదైన కారును గిఫ్టుగా అందుకున్న దర్శకుల జాబితాలో శ్రీకాంత్ ఓదెల కూడా చేరిపోయాడన్న మాట.

Also Read : Dasara: ‘దసరా’లో కీర్తి నటన ‘మహానటి’ని మించి ఉంటుంది: నాని 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular