Wednesday, March 18, 2026
HomeTrending NewsWorld Heritage Day: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

World Heritage Day: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ – 18) పురస్కరించుకొని ఈ నెల 18 వ తేదిన రామప్ప దేవాలయంలో నిర్వహించే వేడుకల పోస్టర్ ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు (జూలై – 25, 2021) పొందిన ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఏప్రిల్ – 18) ను పురస్కరించుకొని వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పర్యాటక, ఆర్కియాలజీ శాఖల సహకారంతో ములుగు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ” శిల్పం, వర్ణం, కృష్ణం ” – సెల్ బరేటింగ్ ది హెరిటేజ్ రామప్ప పేరుతో వరల్డ్ హెరిటేజ్ డే మెగా వేడుకలను ఏప్రిల్ 18న నిర్వహిస్తున్నారు.  రామప్ప దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులతో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర హెరిటేజ్ తెలంగాణ అధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు ములుగు జిల్లా రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి, చారిత్రక పరిశోధకులు ఈమని శివనాగి రెడ్డి, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిదులు వాసవి గ్రూప్ రింకి, Q city మాలతీ, రజత్, flut గ్రూప్ రాహుల్ కానుగంటి, గురు production రవి దులిపాల్ల తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular