మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర హీరో ఫాదర్ క్యారెక్టర్ అని వార్తలు వచ్చాయి. ఈ క్యారెక్టర్ ను బాలీవుడ్ స్టార్ అనిల్ కఫూర్ తో చేయించనున్నారని ప్రచారం జరిగింది. ఆతర్వాత అనిల్ కపూర్ కాదు.. కన్నడ స్టార్ ఉపేంద్రతో చేయించనున్నారని టాక్ వినిపించింది. సినిమా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఆ కీలక పాత్రను ఎవరితో చేయిస్తున్నారో అనౌన్స్ చేయలేదు. దీంతో ఇది సస్పెన్స్ గానే ఉంది. తాజాగా మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని.. ఫాదర్ క్యారెక్టర్ ను కూడా మహేషే చేస్తున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఫాదర్ క్యారెక్టర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వస్తుందట. దీంతో ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఒకవేళ నిజమైతే కనుక అభిమానులకు పండగే.