Saturday, November 23, 2024
HomeTrending NewsRK Roja: టూరిజ అభివృద్ధికి పటిష్ట చర్యలు:మంత్రి రోజా

RK Roja: టూరిజ అభివృద్ధికి పటిష్ట చర్యలు:మంత్రి రోజా

తెలుగు పండుగలు, కట్టుబాట్లు, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం – యువతకు ఉద్యోగం – ప్రజలకు ఆనందం అనే విధానం ద్వారా పర్యాటక శాఖను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులతో రోజా సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఆర్చరీ ప్లేయర్ సురేఖ,  హాకీ ప్లేయర్ రజని లకు గ్రూప్ -1 ఉద్యోగాలు ఇచ్చామని… క్రీడా అకాడమీ నిర్మాణాల కోసం కిడాంబి శ్రీకాంత్, పివి సింధు లకు స్థలాలు కేటాయించామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ జీవో ప్రకారం వారికి రావాల్సిన అన్ని సదుపాయాలూ అందిస్తున్నామని తెలిపారు.  ఇటీవల వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పర్యాటక శాఖలో వచ్చిన పెట్టుబడులను గ్రౌన్దింగ్ చేసి టెంపుల్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నామని రోజా వివరించారు. అందుకే టూరిజంలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచామన్నారు.

ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ కు త్వరలో శంఖుస్థాపన చేస్తామని, తిరుపతిలో టెంపుల్ టూరిజం, విశాఖలో నేచురల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేశామని రోజా చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్