Friday, June 19, 2026
HomeసినిమాKeerthy Suresh: కీర్తి సురేశ్ కి మళ్లీ పట్టు దొరికినట్టే!

Keerthy Suresh: కీర్తి సురేశ్ కి మళ్లీ పట్టు దొరికినట్టే!

తెలుగులో టాప్ త్రీ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేశ్ ఒకరు. అటు తమిళ సినిమాలు .. ఇటు తెలుగు సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్ ను కాపాడుకుంటూ వెళుతోంది. బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కీర్తి సురేశ్, చైల్డ్ ఆర్టిస్టుగా శభాష్ అనిపించున్న అమ్మాయే. చిన్నప్పటి నుంచి ఆమెకి షూటింగు వాతావరణం తెలుసు .. యాక్టింగ్ పై మంచి అవగాహన కూడా ఉంది. నటనలోని మెళకువలు తల్లి నుంచి నేర్చుకుంటూ వచ్చింది.

తరువాత కాలంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కోలీవుడ్ లోను .. టాలీయవుడ్ లోను ఆమె స్టార్ డమ్ ను అందుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ రెండు భాషల్లో ఆమె కోలీవుడ్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తుందనేది ఆమె ప్లానింగ్ చూస్తేనే అర్థమైపోతోంది. ఆ మధ్య కీర్తి సురేశ్ తమిళ సినిమాలు ఎక్కువగా చేయడం .. తెలుగులో చేసిన సినిమాలు పరాజయం పాలవుతూ రావడంతో, ఒక దశలో ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

అలాంటి పరిస్థితుల్లోనే కీర్తి సురేశ్ చేసిన ‘సర్కారువారి పాట’ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఆశించినస్థాయికి వెళ్లలేకపోయింది. కీర్తి సురేశ్ గురించి చెప్పుకోవాలంటే ‘మహానటి’ తరువాత ఏమీ లేకుండా పోయింది. అలాంటి సమయంలో ఆమె చేసిన సినిమానే ‘దసరా’. ఈ సినిమాలో కీర్తి సురేశ్ డీ గ్లామర్ రోల్ చేసింది. ‘వెన్నెల’ పాత్రలో ఆమె జీవించింది. తెలంగాణ నేపథ్యం .. యాసపై ఆమె పెట్టిన దృష్టి, పెళ్లి కూతురుగా బ్యాండు మేళం ముందు మ్యూజిక్ లెంగ్త్ లో వేసిన మాస్ స్టెప్పులు కీర్తి సురేశ్ అంకితభావానికి అద్దం పడతాయి. ఈ సినిమా వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కీర్తికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. మొత్తానికి ఆమె టాలీవుడ్ లోని తన ప్లేస్ ఫై మళ్లీ పట్టు సాధించినట్టేనని చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular