Saturday, September 21, 2024
HomeTrending NewsKalallo Lyrical Video: 'విరూపాక్ష' బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్

Kalallo Lyrical Video: ‘విరూపాక్ష’ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ‘కలల్లో’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘కలల్లోనే ఉలికిపడుతున్నా .. నిజాన్ని ఒక కొలిక్కి తేవేంటే. ఇలా అయోమయంగా నేనున్నా ఇదంటు తేల్చవేమిటే” అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటను బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది.

అజనీశ్ లోక్ నాథ్ స్వరపరిచిన ఈ పాటకి అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి – మధుశ్రీ ఆలపించారు. రాజు సుందరం కొరియోగ్రఫీని అందించాడు. ఇది హారర్ థ్రిల్లర్ కావడం .. దీనికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్