Saturday, September 21, 2024
HomeసినిమాHanu-Man: ‘హను-మాన్‌’ షూటింగ్ పూర్తి

Hanu-Man: ‘హను-మాన్‌’ షూటింగ్ పూర్తి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేశారు.

ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన చిత్రాలన్నింటి కంటే బెస్ట్ క్యాలిటీతో  పాటు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కోసం ఈ సినిమాపై ఎక్కువ సమయం కేటాయించారు.హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ విడుద కానుంది. నిర్మాతలు త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్