గుణశేఖర్ కి చారిత్రక నేపథ్యంతో కూడిన కథలపై .. పౌరాణిక నేపథ్యం కలిగిన కథలపై మంచి పట్టుంది. ఆ విషయం ‘రామాయణం’ .. ‘రుద్రమదేవి’ సినిమాలు స్పష్టం చేస్తాయి. రీసెంట్ గా ఆయన నుంచి ‘శాకుంతలం’ సినిమా వచ్చింది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన వివిధ భాషల్లో విడుదలైంది. అయితే ఇంత భారీగా తీసిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడం ఆశ్ఛర్యం.
కథ .. స్క్రీన్ ప్లే పై గుణశేఖర్ కి మంచి పట్టుంది. టేకింగ్ విషయంలో ఆయనకి గల టాలెంట్ ను గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు కూడా. ‘చూడాలని వుంది’ .. ‘ఒక్కడు’ .. ‘అర్జున్’ సినిమాలు దర్శకుడిగా గుణశేఖర్ సమర్ధతకు అద్దం పడతాయి. భారీ సినిమాలను ఆయన అవలీలగా తెరకెక్కించగలరని తెలుసు. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలరని తెలుసు. ఆయన సినిమాల్లోని పాటలు వింటే సంగీతం పరంగా కూడా ఆయనకి మంచి అవగాహన ఉందనే విషయం అర్థమవుతుంది.
అలాంటి గుణశేఖర్ నుంచి వచ్చిన ‘రుద్రమదేవి’ ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘శాకుంతలం’ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. చారిత్రక .. పౌరాణిక కథాంశాలను, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విషయంలో ఆయన ఒక మేజిక్ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టుగా చెప్పుకునే ‘హిరణ్య కశిప’ ఉన్నట్టా .. లేనట్టా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో.